తనికెళ్ళ భరణి దేశవిదేశాల్లోని వేదికలపై అనేక ప్రదర్శనలిచ్చారు. అందులో ఆధ్యాత్మిక, సాహితీ కార్యక్రమాలున్నాయి. మళ్ళా ఎప్పుడెప్పుడా అనుకుంటూ ప్రవాసాంధ్రులు ఆయన కార్యక్రమాల కోసం ఎదురుచూస్తూంటారు.

"ఆటకదరా శివా" మకుటంతో శివతత్వాన్ని స్వయంగా గానం చేసే ఆయన ప్రదర్శనలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని గావిస్తాయి. అన్ని వర్గాలవారిని, అన్ని వయసులవారిని అకట్టుకునే ఆయన గాత్ర , వ్యాఖ్యానాల్లో నిగూఢతత్వాలు, ఆధ్యాత్మిక రహస్యాలు అందరికీ అతి సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉంటాయి. జీవితాన్ని ఆనందమయం చేసుకునే మార్గాలుంటాయి. జీవన సాఫల్యం అందుకునే రహస్యాలుంటాయి. సునిశిత హాస్యంతో బాటు, భాషా చమత్కారాలుంటాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ వేదికలతో పాటు దుబాయి, కువైట్, అమెరికా వంటి పలు దేశాల్లో తనికెళ్ళ భరణి "ఆట కదరా శివా" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల అమెరికాలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో "సాహితీ పంచామృతం" అనే వినూత్న సాహితీ కార్యక్రమాన్ని ప్రదర్శించారు.
సిలికానాంధ్ర, క్యూపర్టినో, కాలిఫోర్నియా


 

రసవాహిని దుబాయ్


తెలుగు కళా సమితి, కువైట్